News October 21, 2024
జగన్ బీజేపీకి దత్తపుత్రుడు: షర్మిల

AP: మాజీ సీఎం YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. గత YCP ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. ‘YSR తన జీవితం మొత్తం మత పిచ్చి BJPని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు’ అని దుయ్యబట్టారు.
Similar News
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<
News December 1, 2025
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.


