News October 21, 2024

జగన్ బీజేపీకి దత్తపుత్రుడు: షర్మిల

image

AP: మాజీ సీఎం YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. గత YCP ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. ‘YSR తన జీవితం మొత్తం మత పిచ్చి BJPని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు’ అని దుయ్యబట్టారు.

Similar News

News November 5, 2024

2024 US elections: పోలింగ్ ప్రారంభం

image

అమెరికా 47వ అధ్య‌క్ష ఎన్నిక‌కు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్ప‌టికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్‌, బ్లూ స్టేట్స్‌లో పెద్ద‌గా హడావుడి లేక‌పోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెల‌కొంది. డెమోక్రాట్ల నుంచి క‌మ‌ల‌, ఆమె ర‌న్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్‌, రిప‌బ్లిక‌న్ల నుంచి ట్రంప్‌, ఆయ‌న ర‌న్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బ‌రిలో ఉన్నారు.

News November 5, 2024

రేపట్నుంచి ఒంటిపూట బడులు

image

TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

News November 5, 2024

ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు

image

ప్ర‌భుత్వ నియామ‌కాల్లో మ‌హిళ‌ల‌కు ఉన్న 33% రిజ‌ర్వేష‌న్ల‌ను 35 శాతానికి పెంచేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు CM మోహ‌న్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్‌ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అన్ని ర‌కాల ప్ర‌భుత్వ నియామకాల్లో (ఫారెస్ట్ మినహా) మహిళలకు 35% రిజర్వేషన్లు అమలుకానున్నాయి. మహిళా సాధికారతలో ఈ నిర్ణయం కీలక ముందడుగని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.