News February 5, 2025
జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్

AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని జగన్ హెచ్చరించారు.
Similar News
News February 8, 2026
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య కుమార్

T20Iల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక POTMలు నెగ్గిన ప్లేయర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.
News February 8, 2026
భాను సప్తమి వ్రత కథ

పురాణాల ప్రకారం ఇందుమతి అనే భక్తురాలు తన జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని వశిష్ఠ మహర్షిని వేడుకుంది. ఆయన సూచన మేరకు ఆమె భాను సప్తమి వ్రతాన్ని ఆచరించింది. సూర్యోదయ స్నానం, ఉపవాసం, సూర్య మంత్ర జపం ద్వారా ఆమె తన ఆత్మను శుద్ధి చేసుకుంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన సూర్య భగవానుడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ సూర్యారాధన ద్వారా లభించే పరమపదాన్ని మనకు వివరిస్తుంది.
News February 8, 2026
ప్రభుత్వ సంస్థల్లో టీ ఫైబర్ మాత్రమే వాడాలని ఆదేశాలు

TG: ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలన్నీ టీ ఫైబర్ ఇంటర్నెట్ వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,484 సంస్థలు టీ ఫైబర్‌ను వినియోగిస్తున్నాయి. 26 జిల్లాల్లోని 8,895 గ్రామపంచాయతీలకు ఈ నెట్‌వర్క్ విస్తరించింది. ఈ సేవలకు వన్ టైం పేమెంట్ రూ.9500 చెల్లించాలి.


