News April 25, 2024

మలి విడత ప్రచారానికి జగన్ సిద్ధం!

image

AP: సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర నిన్నటితో ముగిసింది. ఇవాళ నామినేషన్ వేసిన జగన్.. మలి విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 27 లేదా 28న ప్రచారం ప్రారంభం కానుంది. పోలింగ్ జరిగే నాటికి 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది.

Similar News

News January 18, 2026

NZతో అమీ తుమీ.. RO-KO జోడీపైనే ఆశలు!

image

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. నేడు ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్‌ జరగనుంది. రెండో వన్డేలో రాహుల్, గిల్ మెప్పించినా.. రోహిత్, కోహ్లీ ఇద్దరూ రాణించలేకపోవడం మైనస్ అయ్యింది. ముఖ్యంగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అర్ష్‌దీప్‌కు అవకాశమివ్వాలని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.

News January 18, 2026

ఇవాళ ఈ తప్పులు అస్సలు చేయకండి!

image

నేడు మౌని అమావాస్య కావడంతో సముద్ర/గంగానది స్నానం, ఉపవాసం, మౌనవ్రతం, పూర్వీకులకు తర్పణం, దానాలు చేయడం మంచిది. వ్రత ఫలితం దక్కాలంటే ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘కోపం తెచ్చుకోవడం, ఆర్గ్యుమెంట్స్, అనవసర సంభాషణలు, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, నెగటివ్ థింకింగ్ మానుకోవాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2026

నేడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

image

డబ్బు చేతిలో నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణావర్త శంఖంలో పోసి పూజగదిలో ఉంచాలి. అనంతరం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించాలి. చొల్లంగి సంగమ స్నానం తర్వాత చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.