News November 27, 2024

పరవాడ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి

image

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పరవాడ ఫార్మా సిటీ కంపెనీలో విషవాయువులు లీకై ఒకరు మరణించారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు.

Similar News

News November 27, 2024

HIGH ALERT.. అత్యంత భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి NOV 30 వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

News November 27, 2024

డిసెంబర్ 3న ‘సంక్రాంతికి వస్తున్నాం’ లిరికల్ వీడియో

image

విక్టరీ వెంకటేశ్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ లిరికల్ వీడియోను డిసెంబర్ 3న విడుదల చేస్తామంది. భాస్కరభట్ల రచించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

News November 27, 2024

ఐడియా అదుర్స్: తాగిన మందు బాటిల్ వెనక్కిస్తే రూ.10

image

తమిళనాడులో మద్యం ప్రియులకు పెట్టిన ఓ కండిషన్ మంచి ఫలితాలిస్తోంది. బయట మద్యం తాగి బాటిళ్లు పడేయడంతో చెత్త పేరుకోవడంతో పాటు కొన్నిసార్లు గాయాలూ అవుతాయి. దీంతో బాటిల్ ధరపై షాపులు ₹10 ఎక్కువ తీసుకుని, ఏ వైన్స్‌లో వెనక్కిచ్చినా డబ్బు తిరిగివ్వాలని కోర్టు సూచించింది. దశల వారీగా దీన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు 10 జిల్లాల్లో ఉన్న రిటర్న్ స్కీమ్‌ను సర్కారు త్వరలో రాష్ట్రమంతా విస్తరించనుంది.