News July 26, 2024

అసెంబ్లీకి రాకుండా జగన్ అబద్ధాలు చెబుతున్నారు: CBN

image

AP: వైసీపీ చీఫ్ జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హత్య చేయబడ్డారని జగన్ ఆరోపిస్తున్న 36 మంది పేర్లను ఇంకా ఇవ్వలేదన్నారు. వైసీపీకి విశ్వసనీయత ఉంటే వారి పేర్లు పంపాలన్నారు. తప్పులు చేసిన వారిని తమ ప్రభుత్వం శిక్షిస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు జరిగితే శిక్షించలేదని అన్నారు.

Similar News

News December 7, 2025

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

image

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.

News December 7, 2025

రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

image

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 7, 2025

కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

image

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.