News November 19, 2024
విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు. గాంధీనగర్ బీఆర్‌టీఎస్ రోడ్‌లోని శృంగేరీ శారదా పీఠంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. జగన్ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ ఉన్నారు. అంతకముందు జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు.
Similar News
News December 11, 2024
గంటలో న్యూయార్క్ నుంచి లండన్‌కు..!
అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఇంగ్లండ్‌లోని లండన్‌కు గంటలో ప్రయాణించేలా ట్రైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 3,400 మైళ్ల దూరం ప్రస్తుతం విమానంలో వెళ్లాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతుంది. అట్లాంటిక్ మహా సముద్రంలో ట్రాన్స్ అట్లాంటిక్ టన్నెల్ ద్వారా రైలులో 54 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సుమారు 19.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీనిని నిర్మించేందుకు దశాబ్దాలు పట్టొచ్చు.
News December 11, 2024
2 గంటల్లో 12 పెగ్గులేస్తే..
యువత, మధ్య వయస్కుల్లో బింగే, హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అలవాటు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని డాక్టర్లు అంటున్నారు. 2 గంటల్లోనే 6 పెగ్గులేస్తే బింగే, 10-12 వరకు తాగితే హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అంటారు. సోషల్ ఆబ్లిగేషన్స్, ఫ్రెండ్స్ వల్ల అతిగా మద్యం తాగే అలవాటు పెరుగుతోందని వారు చెప్తున్నారు. దీంతో పాంక్రియాస్, లివర్, స్టొమక్, హార్ట్, మైండ్, నెర్వస్ సిస్టమ్ రోగాలబారిన పడతాయని వార్నింగ్ ఇస్తున్నారు.
News December 11, 2024
అయ్యో.. భవ్యశ్రీ
AP: పేదరికం, మూఢనమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీశాయి. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మి కూతురు భవ్యశ్రీ(8) బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు. దానికితోడు డబ్బులూ లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు. చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.