News March 18, 2024

ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ భేటీ

image

AP: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల(రీజినల్ కోఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో అంశాలు, బస్సు యాత్రపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Similar News

News July 5, 2025

రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

image

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.

News July 5, 2025

సర్పంచి ఎన్నికలు అప్పుడేనా?

image

TG: BC రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఆయనతో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. కులగణనపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. BCలకు 42% సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం.

News July 5, 2025

రైతులకు శుభవార్త.. ఆగస్టు నాటికి కొత్త పాస్ పుస్తకాలు

image

AP: రీసర్వే పూర్తైన గ్రామాల్లో ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి పాస్‌బుక్‌పై QR కోడ్‌తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునేలా చర్యలు సూచించారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.