News April 29, 2024
జగన్ ఓ వైపు.. కౌరవ సైన్యం మరో వైపు: సీఎం జగన్

AP: మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందని సీఎం జగన్ చెప్పారు. పొన్నూరు సభలో మాట్లాడుతూ.. ‘జగన్ ఓ వైపు.. మరోవైపు కౌరవ సైన్యం ఉంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. ఆయన నన్ను బచ్చా అంటున్నారు. మరి 14 ఏళ్లు సీఎంగా చేసిన నీ పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? పోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు హీరోలంతా బచ్చాల్లాగానే కనిపిస్తారు’ అని ఫైరయ్యారు.
Similar News
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్‌ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.
News November 9, 2025
తాజా వార్తలు

☛ పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. సంజీవని పథకం ద్వారా ఇంటి దగ్గరే వైద్యం అందిస్తాం. గ్రామాల్లో 5వేల వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తాం: CM చంద్రబాబు
☛ యాదగిరిగుట్టకు రూ.1,00,57,322 రికార్డ్ ఆదాయం. ఇవాళ ఆలయాన్ని దర్శించుకున్న 78,200మంది భక్తులు
☛ బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే అధికారం: మంత్రి లోకేశ్
☛ నిన్నటి దాకా CM రేసులో భట్టి ఉండేవారు. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు: జగదీశ్ రెడ్డి
News November 9, 2025
నిద్ర సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అధిక రక్తపోటు లక్షణాలు ఎక్కువగా రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్/ఎయిర్ కండిషనర్ ఉన్నా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ మూత్ర విసర్జన, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఛాతి నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.


