News January 3, 2025
లండన్ పర్యటన కోసం కోర్టులో జగన్ పిటిషన్

AP: లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 11 నుంచి 25 వరకు కుటుంబసమేతంగా వెళ్లే ఈ టూర్కు అనుమతించాలని జగన్ కోరారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ కౌంటర్ తర్వాత ఈ పిటిషన్పై కోర్టు వాదనలు విననుంది.
Similar News
News October 19, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొన్ని చోట్ల స్వల్పంగా పెరగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. APలోని చిత్తూరు, కృష్ణా, పల్నాడులో KG ధర రూ.220-240, గుంటూరులో రూ.200-220గా ఉంది. అటు TGలోని HYDలో కిలో రూ.220-240, వరంగల్, హన్మకొండలో రూ.210-230కు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? COMMENT
News October 19, 2025
గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే?

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో 5 రోజుల్లోపు తీసుకోవచ్చంటున్నారు. అయితే దీన్ని అబార్షన్ ప్రేరేపితంగా ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ మాత్ర వల్ల మైగ్రేన్, అలసట, వాంతులు, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు.
* ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 19, 2025
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ 5 హిందీ ట్రాన్స్లేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. డిగ్రీ (హిందీ, ఇంగ్లిష్ ఎలక్టివ్ సబ్జెక్ట్ కలిగినవారు) ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://mumbaiport.gov.in/