News January 3, 2025

లండన్ పర్యటన కోసం కోర్టులో జగన్ పిటిషన్

image

AP: లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 11 నుంచి 25 వరకు కుటుంబసమేతంగా వెళ్లే ఈ టూర్‌కు అనుమతించాలని జగన్ కోరారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ కౌంటర్ తర్వాత ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.

Similar News

News January 25, 2025

డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్

image

డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.

News January 25, 2025

జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్

image

జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్‌లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్‌లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.

News January 25, 2025

నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల

image

ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.