News April 11, 2024
జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు: CBN

AP: జగన్ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని.. కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని శాశ్వతంగా దక్కించుకోలేమని చంద్రబాబు అన్నారు. ‘ఆరోగ్య శ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్ నొక్కింది ఎంత? వైసీపీ వాళ్లు దోచింది ఎంత? భూపరిరక్షణ చట్టం పేరుతో ప్రజల భూమిని తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదం ఉంది. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. మద్యం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు తెచ్చారు’ అని ఆరోపించారు.
Similar News
News November 12, 2025
ఢిల్లీ బ్లాస్ట్‌కు టెలిగ్రామ్‌తో లింక్!

ఢిల్లీ బ్లాస్ట్‌లో కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా రాడికల్ డాక్టర్లు గ్రూపుగా ఏర్పడి సమాచారాన్ని చేరవేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ యాప్‌పై ఎప్పటినుంచో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. కంటెంట్ నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ యాప్ బ్యాన్ చేయాలనే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.
News November 12, 2025
‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.
News November 12, 2025
18 రోజులు.. ఈసారి మహాభారతమే

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.


