News February 6, 2025
విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్
AP: విజయసాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 6, 2025
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP
TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్‌లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.
News February 6, 2025
మూడు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’: చంద్రబాబు
AP: పీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
News February 6, 2025
విద్యార్థినిపై అత్యాచారం.. నటి తీవ్ర ఆవేదన
అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.