News June 23, 2024
జగన్ సభకొస్తే గౌరవిస్తా: అయ్యన్నపాత్రుడు

AP: అసెంబ్లీలో పలు మీడియా సంస్థలపై నిషేధం ఎత్తివేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ‘జగన్కు ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలోకి వస్తే గౌరవిస్తా. స్పీకర్ ఎన్నిక సమయంలో సభలోకి రావాలనే స్పృహ లేకపోతే ఎలా? సభా సంప్రదాయాలను ఎంత పెద్దవారైనా గౌరవించాల్సిందే. గత ప్రభుత్వ దౌర్జన్యాలపై నేను దూకుడుగా మాట్లాడా. ఇప్పుడు బాధ్యతాయుత పదవిలో ఉన్నా. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 20, 2025
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.
News November 20, 2025
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.
News November 20, 2025
BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.


