News June 23, 2024
జగన్ సభకొస్తే గౌరవిస్తా: అయ్యన్నపాత్రుడు
AP: అసెంబ్లీలో పలు మీడియా సంస్థలపై నిషేధం ఎత్తివేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ‘జగన్‌కు ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలోకి వస్తే గౌరవిస్తా. స్పీకర్ ఎన్నిక సమయంలో సభలోకి రావాలనే స్పృహ లేకపోతే ఎలా? సభా సంప్రదాయాలను ఎంత పెద్దవారైనా గౌరవించాల్సిందే. గత ప్రభుత్వ దౌర్జన్యాలపై నేను దూకుడుగా మాట్లాడా. ఇప్పుడు బాధ్యతాయుత పదవిలో ఉన్నా. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 13, 2024
ఆ వెంటనే KTRపై చర్యలు: CM రేవంత్
TG: గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఈ-రేస్ స్కామ్‌లో KTRపై చర్యలు తీసుకుంటామని CM రేవంత్ అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే KTR ఢిల్లీకి వచ్చారని ఆయన ఆరోపించారు. BJPని అంతం చేస్తామన్న ఆయన ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఓ న్యూస్ ఛానల్‌తో సీఎం మాట్లాడారు.
News November 13, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 13, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 13, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:05
✒ సూర్యోదయం: ఉదయం 6:20
✒ దుహర్: మధ్యాహ్నం 12:00
✒ అసర్: సాయంత్రం 4:05
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:41
✒ ఇష: రాత్రి 6.56
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.