News September 27, 2024

తిరుమలకు జగన్‌.. డిక్లరేషన్ కోరనున్న TTD?

image

AP: లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయ మంటలు చెలరేగుతున్న వేళ మాజీ CM జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది. ఇవాళ తిరుమల చేరుకోనున్న ఆయన రేపు దర్శనానికి వెళ్తారు. అయితే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్లుగానే జగన్ నుంచీ తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతిథిగృహంలో ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారని సమాచారం. ఆయన సంతకం పెట్టకపోతే నిబంధనల మేరకు దర్శనానికి అనుమతించబోరని తెలుస్తోంది.

Similar News

News October 5, 2024

ఇంగ్లండ్‌లో నవజాత శిశువులకు జన్యుపరీక్షలు.. ఎందుకంటే..

image

వందలాదిమంది నవజాత శిశువులకు ఇంగ్లండ్‌ జన్యుపరీక్షలు నిర్వహిస్తోంది. దీని ద్వారా జన్యుపరంగా తలెత్తే అరుదైన ఆరోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. దీనికోసం బొడ్డుతాడు నుంచి జన్యువుల్ని సేకరిస్తారు. NHS, జెనోమిక్స్ ఇంగ్లండ్ సంస్థలు కలిసి ఈ కార్యక్రమం చేపట్టాయని, లక్షమంది శిశువులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

News October 5, 2024

ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు.. కారణం అదే!

image

యూపీలోని అమేథీలో గురువారం ఇద్దరు పిల్లలు సహా దంపతులను హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. నిందితుడు చందన్ వర్మ.. సునీల్ కుమార్ (35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు అతడి భార్య పూనం (32), ఇద్దరు చిన్న పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం సూసైడ్ చేసుకునేందుకు యత్నించగా మిస్ ఫైర్ అయి బతికిపోయాడు. చందన్, పూనం మధ్య వివాహేతర సంబంధం ఉందని, విభేదాలతో ఆమె కేసు పెట్టడమే దీనికి కారణమని పోలీసులు గుర్తించారు.

News October 5, 2024

ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తా: గోపీచంద్

image

తాను చేసిన విలన్ పాత్రలు బలమైన ముద్ర వేశాయని, అందుకే ఫ్యాన్స్ తనను మళ్లీ ఆ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారని హీరో గోపీచంద్ అన్నారు. ప్రభాస్ సినిమాలో అయితేనే తాను విలన్‌గా నటిస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కొన్ని సినిమాల రిజల్ట్ రిలీజ్‌కు ముందే తెలిసిపోతుందని, కానీ నమ్మకంగా ప్రమోషన్ చేస్తామని చెప్పారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆయన నటించిన ‘విశ్వం’ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.