News March 29, 2024
జగన్ 30 ఏళ్ల పాటు పాలన చేస్తారు: ముద్రగడ

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జగన్ పాలన చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని అన్నారు.
Similar News
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.
News November 23, 2025
పిల్లలు బరువు తగ్గుతున్నారా?

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.


