News March 29, 2024

జగన్ 30 ఏళ్ల పాటు పాలన చేస్తారు: ముద్రగడ

image

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జగన్ పాలన చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని అన్నారు.

Similar News

News February 12, 2026

లిక్కర్ స్కామ్‌కు రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్: సుప్రీంకోర్టు

image

AP: మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రాజ్ తరఫు న్యాయవాది చెప్పగా ధర్మాసనం అనుమతించింది. ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

News February 12, 2026

విదేశీ విద్యపై మోజు తగ్గుతోంది..

image

భారతీయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై మోజు తగ్గుతోంది. అబ్రాడ్‌కు వెళ్లే వారి సంఖ్య రెండేళ్లలో 31% తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2023లో ఫారిన్‌కు 9.8L మంది వెళ్లారు. ఆ సంఖ్య 2024లో 7.7L ఉండగా 2025 నాటికి 6.26Lకు పడిపోయింది. ‘విదేశీ చదువు వారి వ్యక్తిగతం. ఆర్థిక స్తోమత, బ్యాంకు లోన్లు పొందడం, పలు దేశాలను చూడాలనుకోవడం.. ఇలా పలు అంశాలు ప్రభావితం చేస్తాయి’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

News February 12, 2026

లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

image

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్‌ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్‌ బ్రీతబుల్‌ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.