News September 10, 2024
లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం: లోకేశ్

AP: ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని పన్నిన కుట్ర బట్టబయలైంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 17, 2025
నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.
News September 17, 2025
MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.
News September 17, 2025
ICC ర్యాంకింగ్స్.. టీమ్ ఇండియా హవా

ICC తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా సత్తా చాటింది. వన్డే, T20 ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచింది. No.1 వన్డే బ్యాటర్‌గా గిల్, No.1 T20 బ్యాటర్‌గా అభిషేక్, No.1 టెస్ట్ బౌలర్‌గా బుమ్రా, No.1 T20 బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి, No.1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా జడేజా, No.1 టీ20 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ నిలిచారు. అటు స్మృతి మంధాన ఉమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరారు.