News September 10, 2024
లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం: లోకేశ్
AP: ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని పన్నిన కుట్ర బట్టబయలైంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 10, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 10, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:19 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:58 గంటలకు
ఇష: రాత్రి 7.10 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 10, 2024
విలువలు అంటే గుర్తొచ్చేది రతన్ టాటా
విలువలతో కూడిన వ్యాపారమంటే ముందుగా గుర్తొచ్చేది రతన్ టాటా. గ్రూపులో నష్టాల్లో ఉన్న కంపెనీని వదిలించుకుందామని బోర్డు మెంబర్స్ అంటే ఆయన ఒప్పుకొనేవారే కాదు. దానిపై ఆధారపడి బతికే ఉద్యోగుల జీవితాల గురించే ఆలోచించేవారు. ఆ కంపెనీని కాకుండా మొత్తం గ్రూప్‌ను ఒక యూనిట్‌గా తీసుకొనేవారు. సైరస్ మిస్త్రీ టాటాసన్స్ బాధ్యతలు చేపట్టాక మెటల్ కంపెనీలను అమ్మేద్దామంటే అస్సలు ఒప్పుకోలేదు. చాలా అంశాల్లో విభేదించారు.
News October 10, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.