News April 25, 2024
జగన్‌పై దాడి కేసు.. సతీశ్‌కు పోలీస్ కస్టడీ

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న ఆయన్ను 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 27 వరకు పోలీసులు సతీశ్‌ను విచారించనున్నారు. లాయర్ సమక్షంలో అతడిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించాలని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
Similar News
News December 11, 2025
HYDలో రెన్యువల్‌కు డిసెంబర్ 20 లాస్ట్ డేట్!

GHMC పరిధిలోని వ్యాపార సంస్థలు 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్‌లను డిసెంబర్ 20 లోపు రెన్యువల్ చేసుకోవాలని GHMC విజ్ఞప్తి చేసింది. ఈ తేదీలోగా రెన్యువల్ చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ ఉండదు. డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 19 వరకు 25% పెనాల్టీ, ఆ తర్వాత 50% పెనాల్టీ ఉంటుందని GHMC స్పష్టం చేసింది. పెనాల్టీలను నివారించడానికి గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యాపారులకు సూచించింది.
News December 11, 2025
రోజ్మేరీ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి
News December 11, 2025
550 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కపుర్తాలాలోని <


