News October 30, 2024
రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ

AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.
Similar News
News October 23, 2025
రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.
News October 22, 2025
సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో హార్దిక్ పాండ్య!

ఆసియా కప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో హార్దిక్ పాండ్య టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు కూడా అతను విశ్రాంతిలోనే ఉన్నారు. అయితే హార్దిక్ కోలుకున్నారని, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్‌కి అందుబాటులో ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. SA జట్టు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది.
News October 22, 2025
ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్‌న్యూస్

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.