News October 30, 2024

రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ

image

AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.

Similar News

News November 7, 2024

ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

image

TG: ప్రభుత్వం నిన్నటి నుంచి కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి ఇంటికీ వెళ్తున్న సిబ్బంది ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపటి వరకు ఆ వివరాలన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే మొదలవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ ప్రక్రియను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 7, 2024

2 రోజుల్లో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండిలోగా అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడుగా ఈశాన్య రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడతాయంది. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

News November 7, 2024

వాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానిస్తాం: చంద్రబాబు

image

అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు మూలాలున్న <<14543492>>ఉషా వాన్స్ <<>>చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. ‘ప్రపంచంలోని తెలుగువారందరికీ ఇది గర్వకారణం. వారిని ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. అటు డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.