News February 17, 2025
ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం: లోకేశ్

AP: రాష్ట్రంలో YCP ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.
Similar News
News November 17, 2025
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ వంటి పశుగ్రాసాలను సాగుచేయాలి. అలాగే సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. ✍️మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 17, 2025
ఎయిర్ లైన్స్ మొదటి మహిళా CEO

ఎయిర్ ఇండియా తొలి మహిళా పైలట్ హర్ప్రీత్ ఒక ఎయిర్ లైన్స్కి మొదటి మహిళా CEOగా నిలిచి రికార్డు సృష్టించారు. 1988లో ఎయిర్ ఇండియాలో చేరిన హర్ప్రీత్ ‘ఎయిర్ ఇండియా’ సహాయక సంస్థ అయిన ‘అలయెన్స్ ఎయిర్’కి సీఈవోగా ఉన్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె ‘ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ’ నుంచి వాణిజ్య విమానాల పైలట్గా శిక్షణ పొందారు. విమానయానంలో కెరీర్ను ఎంచుకున్న మహిళలకు మార్గదర్శకంగా ఉంటున్నారు.
News November 17, 2025
డిసెంబర్లోనే లోకల్ బాడీ ఎన్నికలు.. లేదంటే!

TG: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను డిసెంబర్లో మొదలెట్టి జనవరి తొలి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరులో మేడారం జాతర, FEB 25 నుంచి ఇంటర్, MAR 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండటంతో అధికారులు వాటితో బిజీ కానున్నారు. దీంతో JANలోగా ఎలక్షన్స్ పెట్టకపోతే ఏప్రిల్ వరకు ఆగాల్సి రావొచ్చు. ఇవాళ క్యాబినెట్లో సాధ్యాసాధ్యాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.


