News August 13, 2025

జగన్ హాట్‌లైన్ కామెంట్స్.. స్పందించిన లోకేశ్

image

AP: చంద్రబాబు, రాహుల్ మధ్య <<17390003>>హాట్‌లైన్ <<>>ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘మాకు ఏపీ ప్రజలతోనే హాట్‌లైన్ ఉంది. మీ ఓటు చోరీ సాకులను మర్చిపోండి. మీ నోట్‌చోరీ‌తో విసిగి ప్రజలు మిమ్మల్ని దించేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఏపీ మళ్లీ నం.1గా నిలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News August 13, 2025

చర్చలు విఫలం.. కొనసాగనున్న సినీ కార్మికుల సమ్మె

image

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికుల సమ్మె కొనసాగనుంది. ‘షరతులతో కూడిన పని విధానాలకు కార్మికులు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రూ.2,000 కంటే తక్కువ తీసుకునే వారికి ఒక విధానం, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో విధానాన్ని ప్రతిపాదించాం. మరో 2, 3 సార్లు చర్చలు జరగాల్సి ఉంది’ అని దిల్ రాజు తెలిపారు.

News August 13, 2025

సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

image

AP: వైసీపీ నేత, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారని యర్రగుంట్ల పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నిడిజువ్విలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు యర్రగుంట్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు.

News August 13, 2025

NEET (UG) కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల భర్తీకి చేపట్టిన NEET (UG) కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. అలాట్‌మెంట్ లెటర్‌ను MCC వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.