News June 20, 2024
రేపటి నుంచి CBI కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
YCP అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటి నుంచి చేపట్టాలని CBI కోర్టు నిర్ణయించింది. ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లను మళ్లీ విచారించనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ కొనసాగుతోంది. సీబీఐ కోర్టు గత జడ్జి బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్ల విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
Similar News
News September 13, 2024
నేడు పిఠాపురానికి వైఎస్ జగన్
AP: వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం రానున్నారు. నియోజకవర్గంలోని మాధవపురం, రమణక్కపేటలో ప్రజలు, రైతులతో సమావేశమవుతారు. అలాగే ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమై నీటమునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.
News September 13, 2024
మూత్రం, మురుగు నీటి నుంచి బీర్ తయారీ!
సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.
News September 13, 2024
పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్.. గరిష్ఠంగా రూ.10 వేలే సబ్సిడీ: కేంద్రమంత్రి
విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.