News June 12, 2024
జగన్ ఫొటో ఉన్నా చంద్రబాబు కాదనలేదు: TDP

AP: చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని TDP ట్వీట్ చేసింది. ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని జగన్ బొమ్మ ఉన్నా స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని Xలో పోస్ట్ చేసింది.
Similar News
News March 17, 2025
రన్యారావు కేసులో మరో ట్విస్ట్

బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్టైన నటి రన్యా రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య రన్యా రావుతో తనకు సంబంధం లేదని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు గతేడాది నవంబర్‌లో పెళ్లి కాగా, డిసెంబర్ నుంచే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో జతిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.
News March 17, 2025
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

TG: ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ పీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
News March 17, 2025
రాత్రి ఈ టెక్నిక్స్ పాటిస్తే..

త్వరగా నిద్రపోయేందుకు ఇటీవల చాలామంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు. తక్కువ సమయంలో నిద్రకు సైనికులు పాటించే ఈ విధానంతో 10 సెకన్లలోనే నిద్ర వస్తుందట. పడుకుని ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి. దీర్ఘ శ్వాసలతో పది సెకన్ల పాటు ప్రశాంత ఘటనను ఆలోచిస్తూ కళ్లు మూసుకోవాలి. ఒకవేళ నిద్ర రాలేదంటే మనసులోకి వచ్చే ఆలోచనలను ‘ఆలోచించకు’ అని ఆపేస్తూ తిరిగి ప్రయత్నించాలి.