News September 20, 2024
మధ్యాహ్నం జగన్ ప్రెస్‌మీట్!
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంపై, కూటమి 100 రోజుల పాలన తీరుపై ఆయన మీడియాతో మాట్లాడతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
Similar News
News October 4, 2024
డీఎస్పీగా నిఖత్ జరీన్
TG: బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ యూనిఫామ్‌లో కనిపించారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్-2024 ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆమెను సత్కరించి లాఠీని అందజేశారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం అని CM అన్నారు. బాక్సింగ్‌లో రాణించి మెడల్స్ సాధించినందుకు గాను ఆమెకు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.
News October 4, 2024
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, యాదాద్రి, SRD, ADB, NML, NZB, JN, KMR, SDPT, NRPT, MDK, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు APలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని APSDMA తెలిపింది.
News October 4, 2024
బెయిల్ కోరుతూ హైకోర్టులో సజ్జల పిటిషన్
AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయ కక్షలో భాగంగానే తనను ఇరికించారని వాపోయారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని, బెయిల్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ జరపనుంది.