News May 7, 2024
నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22024/1708926916147-normal-WIFI.webp)
AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు రాజానగరం (రాజమండ్రి పార్లమెంట్), మ.12.30కు ఇచ్చాపురం (శ్రీకాకుళం పార్లమెంట్), మ.3 గంటలకు గాజువాక (విశాఖ పార్లమెంట్) నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Similar News
News February 15, 2025
చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరం: అనిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739612653276_695-normal-WIFI.webp)
AP: సమాజంలో దొంగలు తెలివి మీరిపోయారని, ప్రతి వ్యక్తీ తనపై తాను నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోంమంత్రి అనిత చెప్పారు. టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించాలని పోలీసులకు సూచించారు. విజయవాడలో నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
News February 15, 2025
MLAపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739612934915_81-normal-WIFI.webp)
AP: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ నేత కారు డ్రైవర్‌ను తాను దూషిస్తూ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై చింతమనేని సీఎంకు వివరణ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం వంటి పనులతో పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని CM ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని, సహనంతో వ్యవహరించాలని సూచించారు.
News February 15, 2025
కేసీఆర్‌కు పట్టిన గతి రేవంత్‌కు పడుతుంది: ఎంపీ లక్ష్మణ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739610372334_1226-normal-WIFI.webp)
TG: ప్రధాని మోదీ కులంపై సీఎం <<15461493>>రేవంత్ చేసిన వ్యాఖ్యలపై<<>> బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడి ఇంటికి వెళ్లారని దుయ్యబట్టారు. రేవంత్‌కు కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.