News February 15, 2025

చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరం: అనిత

image

AP: సమాజంలో దొంగలు తెలివి మీరిపోయారని, ప్రతి వ్యక్తీ తనపై తాను నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోంమంత్రి అనిత చెప్పారు. టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించాలని పోలీసులకు సూచించారు. విజయవాడలో నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

Similar News

News March 25, 2025

బంగ్లాలో సైనిక తిరుగుబాటు?

image

బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూనస్ పట్ల బంగ్లా సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, 8మంది మేజర్ జనరల్స్‌, కమాండర్స్, కీలక అధికారులతో ఆర్మీ చీఫ్ వకెర్-ఉజ్-జమాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడంతో తిరుగుబాటు వార్తలు ఊపందుకున్నాయి.

News March 25, 2025

ఈ IPL సీజన్‌లో వారిదే హవా..!

image

IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచులు జరగ్గా అన్నిట్లోనూ ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లే POTMగా నిలిచారు. వీరిలో కృనాల్ పాండ్య (RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్ (CSK), అశుతోశ్ శర్మ (DC) ఉన్నారు. గత సీజన్‌లో వీరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్‌లో జట్టు మారగానే విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు.

News March 25, 2025

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణ

image

TG: BRS MLA పాడి కౌశిక్ వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై SCలో విచారణ మొదలైంది. కౌశిక్ తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ‘ముగ్గురు MLAలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోలేదు. సుప్రీం జోక్యం చేసుకున్న తర్వాతే నోటీసు ఇచ్చారు. వాటిపై ఎమ్మెల్యేలు వారంలో సమాధానం ఇవ్వాలి. కానీ ఇప్పటికి 3 వారాలైనా వారు స్పందించడంలేదు’ అని జడ్జి జస్టిస్ గవాయ్ దృష్టికి తీసుకెళ్లారు.

error: Content is protected !!