News December 23, 2024
రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన

AP: మాజీ CM జగన్ రేపటి నుంచి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకొని YSR ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరగనున్న ఓ వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 4, 2025
గుర్తింపు, పదవుల కోసం పాకులాడను: పవన్

AP: నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు, పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు బాధ్యత అని నమ్ముతానన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అనే తపన ఉన్నవాళ్లేనని పేర్కొన్నారు.
News December 4, 2025
మన రూపాయికి విలువే లేదు: ఖర్గే

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల <<18465153>>కనిష్ఠ స్థాయి<<>>కి చేరడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రూపాయి క్షీణిస్తోందని ఆరోపించారు. ‘కేంద్రం విధానాలు మన కరెన్సీని బలహీనపరిచాయి. అవే బాగుంటే రూపాయి పైకి ఎగిసేది. మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మనల్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ప్రపంచంలో మన రూపాయికి విలువే లేదు’ అని ఫైరయ్యారు.
News December 4, 2025
నిర్మాత మృతి.. హీరో సూర్య కన్నీళ్లు

ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) <<18464480>>భౌతికకాయానికి<<>> సీఎం స్టాలిన్, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థివ దేహాన్ని చూస్తూ హీరో సూర్య, ఆయన తండ్రి శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య నటించిన సుందరాంగుడు, వీడొక్కడే సినిమాలను ఏవీఎం సంస్థే తెరకెక్కించింది. కాగా శరవణన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.


