News November 23, 2024
లీడింగ్‌లో ‘జాగ్వార్’ హీరో

కర్ణాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో హీరో నిఖిల్ కుమారస్వామి ఆధిక్యం సాధించారు. JDS నుంచి బరిలో నిలిచిన ఆయన 783 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయన ‘జాగ్వార్’ సినిమాలో హీరోగా నటించారు. కర్ణాటక మాజీ సీఎం, కేంద్రమంత్రి HD కుమారస్వామి కుమారుడే ఈ నిఖిల్.
Similar News
News November 7, 2025
అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు

AP: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు అలర్ట్. వారికి టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజూ 750 టికెట్లను ఆన్‌లైన్ డిప్ విధానంలో జారీ చేస్తుండగా, ఈ విధానాన్ని రద్దు చేసింది. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో టికెట్లు కేటాయించనుంది. ఇకపై 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది.
News November 7, 2025
సచివాలయాల పేరును మార్చలేదు: CMO

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.
News November 7, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/


