News January 1, 2025
‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ – కాంగ్రెస్ కొత్త క్యాంపెయిన్
కాంగ్రెస్ JAN 3న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ క్యాంపెయిన్‌ను ఆరంభిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని బ్లాకులు, జిల్లా, రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించనుంది. JAN 26న అంబేడ్కర్ స్వస్థలం మోవ్ (MP) వద్ద ముగింపు పలకనుంది. నిజానికి DEC 27నే ర్యాలీలు ఆరంభించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. మాజీ PM మన్మోహన్ మృతితో వాయిదా వేసింది. 2026 JAN 26 వరకు ఈ తరహా క్యాంపెయిన్లు ఉంటాయని కాంగ్రెస్ వెల్లడించింది.
Similar News
News January 18, 2025
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహశకలం
భారీ స్టేడియం పరిమాణంతో 820 అడుగుల గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఇది రేపు భూమికి చేరువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024 WY70 అని పిలువబడే ఒక భారీ గ్రహశకలం 36,606 KMPH వేగంతో దూసుకొస్తోంది. ఒకవేళ ఇది భూమిని ఢీకొన్నట్లయితే భారీ ఎత్తున వినాశనం జరుగుతుందని, దీని ప్రభావం వందలాది అణు బాంబులతో సమానమని NASA తెలిపింది.
News January 18, 2025
విజయవాడకు అమిత్ షా.. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో డిన్నర్
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు లోకేశ్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. రాత్రికి ప్రైవేట్ హోటల్‌లో బస చేసే ఆయన రేపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.
News January 18, 2025
సైఫ్ అలీ ఖాన్‌కు రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్!
కత్తి దాడి నుంచి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. వైద్య ఖర్చులకు గాను ఆయన Niva Bupaలో రూ.35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ఓ డాక్యుమెంట్ బయటికొచ్చింది. రూ.25 లక్షలు అప్రూవ్ చేసినట్లు అందులో ఉంది. ఈ వార్తలపై కంపెనీ స్పందిస్తూ ఆయన ఫైనల్ బిల్లులు సమర్పించిన తర్వాత మొత్తాన్ని సెటిల్ చేస్తామని పేర్కొంది. ఎంత క్లెయిమ్ చేశారనేది అధికారికంగా తెలపలేదు.