News July 9, 2024

ICC ఛైర్మన్‌గా జై షా?

image

ICC ఛైర్మన్‌గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్‌బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Similar News

News October 7, 2024

VIRAL: హైదరాబాద్ గొప్పతనం ఇదే!

image

పొట్టకూటి కోసం తరలివచ్చిన ఎంతో మందికి హైదరాబాద్ అండగా నిలిచిందని తెలిపే ఓ ఫొటో వైరలవుతోంది. ‘బతకడమే వేస్ట్ అనుకున్న నాకు.. హైదరాబాద్ ఎలా బతకాలో నేర్పింది’ అని ఓ వ్యక్తి తన ఆటో వెనుక రాసుకున్నారు. దీనిని ఓ వ్యక్తి ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఉపాధి కోసం వస్తే అమ్మలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని నెటిజన్లు కితాబిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు HYDలో ఉపాధి పొందుతున్నారు.

News October 7, 2024

DMK vs పవన్ కళ్యాణ్

image

డీఎంకే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ వేయడంపై డీఎంకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు పవన్‌పై అడ్వకేటుతో ఫిర్యాదు చేయించడం, ప్రకాశ్ రాజ్‌‌తో ట్వీట్లు పెట్టించడం DMK పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

News October 7, 2024

రూ.14వేల ఇసుక రూ.21వేలకు చేరింది: బొత్స

image

AP: రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పని లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ హయాంలో విశాఖలో 10 టన్నుల ఇసుక రూ.14వేలకు దొరికేదని, ప్రస్తుతం అది రూ.21వేలకు చేరిందని విమర్శించారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఫైరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ ఆపాలని డిమాండ్ చేశారు.