News April 14, 2025
విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు.. కొత్త వివాదంలో TN గవర్నర్

తమిళనాడు గవర్నర్ R.N.రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మధురైలోని ఓ కళాశాల విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని DMK, కాంగ్రెస్, CPI నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News April 15, 2025
సరస్వతీ పుష్కరాలు.. ప్రత్యేక యాప్ ఆవిష్కరణ

TG: వచ్చే నెలలో సరస్వతీ పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, సురేఖ ప్రత్యేక యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. కాళేశ్వరంలో మే 15-26 వరకు జరిగే పుష్కరాలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇందులో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోజూ లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. ఈ త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని విశ్వసిస్తారు.
News April 15, 2025
కెరీర్ పట్ల ఎలాంటి రిగ్రెట్ లేదు: భువనేశ్వర్

తన కెరీర్ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు గానీ పశ్చాత్తాపం గానీ లేదన్నారు. ఇంతకుమించి తానేమీ కోరుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ స్వింగ్ బౌలర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2022 నవంబర్‌లో ఆడారు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న భువీ IPLలో అత్యధిక వికెట్లు(187) తీసిన పేసర్‌గా ఉన్నారు.
News April 15, 2025
పోలీసింగ్‌లో సౌతిండియా టాప్.. AP, TG ర్యాంకులు ఎంతంటే?

ఫోర్త్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం పోలీసింగ్, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయ సహాయంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఈ విభాగాల్లో కర్ణాటక టాప్ ప్లేస్ దక్కించుకోగా AP, TG, KL, TN టాప్-5లో ఉన్నాయి. బెంగాల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది సర్వేలో TG 11వ స్థానంలో నిలవగా ఈసారి మూడో ప్లేస్‌కి దూసుకొచ్చింది. ఇక గత పదేళ్లలో జైళ్లలోని ఖైదీల సంఖ్య 50శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.