News November 29, 2024

జైలు జీవితం చిన్న గ్యాప్ మాత్రమే: MLC కవిత

image

TG: జైలుకు వెళ్లొచ్చిన వారు CM అవుతారనుకుంటే KTRకు ఆ ఛాన్స్ లేదని, ఎందుకంటే కవిత ఆల్రెడీ జైలుకు వెళ్లొచ్చారని CM రేవంత్ వ్యాఖ్యలపై MLC కవిత స్పందించారు. సెన్సేషన్ కోసమే రేవంత్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో జైలు జీవితం కేవలం చిన్న గ్యాప్ మాత్రమేనన్నారు. లగచర్ల భూసేకరణ రద్దు BRS విజయమన్న కవిత.. హాస్టల్స్‌లో అమ్మాయిలు చనిపోతే ప్రభుత్వం విఫలమైనట్లు కాదా? అని ప్రశ్నించారు.

Similar News

News January 14, 2026

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

image

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. స్టోరీ లైన్ పాతదే అయినా కామెడీతో నవీన్ వన్ మ్యాన్ షో చేశారని ఆడియన్స్ తెలిపారు. పాటలను గ్రాండ్‌గా చిత్రీకరించారని, నిర్మాణ విలువలు బాగున్నాయన్నారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయని చెప్పారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ & రేటింగ్.

News January 14, 2026

NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

image

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంతో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్‌గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News January 14, 2026

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

image

AP: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.