News April 24, 2024
చరిత్ర సృష్టించిన జైస్వాల్

నిన్న MIపై సెంచరీతో చెలరేగిన RR ప్లేయర్ జైస్వాల్ IPL హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 23 ఏళ్ల వయసు లోపు(22Y 116D) రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇతను గత ఏడాది MIపైనే తొలి సెంచరీ బాదారు. తక్కువ ఏజ్‌లో రెండు సెంచరీలు కొట్టిన వారి జాబితాలో గిల్(23Y 255D), శాంసన్(24Y 138D), వార్నర్(25Y 196D), కోహ్లీ(27Y 184D) ఉన్నారు.
Similar News
News November 15, 2025
DRDOలో 18 అప్రెంటిస్‌లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News November 15, 2025
రెండు చోట్ల ఓడిన బిహార్ ‘సింగం’

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిహార్ ‘సింగం’గా పిలవబడే మాజీ ఐపీఎస్ శివ్‌దీప్ లాండే ఓటమిపాలయ్యారు. అరారియా, జమాల్‌పూర్ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమాల్‌పూర్‌లో జేడీయూ నేత నచికేత మండల్ 96,683 ఓట్లతో, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహ్మాన్ 91,529 ఓట్లతో విజయం సాధించారు. లాండేకు ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.
News November 15, 2025
నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.


