News April 24, 2024
చరిత్ర సృష్టించిన జైస్వాల్

నిన్న MIపై సెంచరీతో చెలరేగిన RR ప్లేయర్ జైస్వాల్ IPL హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 23 ఏళ్ల వయసు లోపు(22Y 116D) రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇతను గత ఏడాది MIపైనే తొలి సెంచరీ బాదారు. తక్కువ ఏజ్‌లో రెండు సెంచరీలు కొట్టిన వారి జాబితాలో గిల్(23Y 255D), శాంసన్(24Y 138D), వార్నర్(25Y 196D), కోహ్లీ(27Y 184D) ఉన్నారు.
Similar News
News July 11, 2025
తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.
News July 11, 2025
HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారించనుంది.
News July 11, 2025
భారత్‌పై 11వ సెంచరీ బాదిన రూట్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.