News April 4, 2025

గోవాకు జైస్వాల్.. అతనితో వివాదమే కారణం?

image

రహానేతో వివాదం వల్లే జైస్వాల్ <<15971972>>ముంబైను వీడాలని<<>> నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2022 రంజీ మ్యాచ్‌లో బ్యాటర్‌ను స్లెడ్జింగ్ చేస్తున్నాడని జైస్వాల్‌ను రహానే ఫీల్డ్ నుంచి పంపించారు. ఇదే వీరి మధ్య వివాదానికి బీజం వేసినట్లు సమాచారం. షాట్ సెలక్షన్, జట్టుపై నిబద్ధత పట్ల రహానే తరచూ ప్రశ్నించడమూ జైస్వాల్‌కు నచ్చలేదని.. 2025 రంజీ మ్యాచ్‌లో రహానే కిట్‌ను జైస్వాల్ తన్నడంతో వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.

Similar News

News April 5, 2025

సినిమాల్లో ఏజ్ గ్యాప్ సాధారణం: అమీషా పటేల్

image

సికిందర్ మూవీలో నటించిన సల్మాన్ ఖాన్, రష్మిక మధ్య 31 ఏళ్ల <<15866268>>ఏజ్ గ్యాప్‌పై<<>> జరుగుతున్న ట్రోల్స్‌పై హీరోయిన్ అమీషా పటేల్ స్పందించారు. సినిమాల్లో నటుల మధ్య వయసు వ్యత్యాసం సాధారణ విషయమన్నారు. గదర్ చిత్రంలో తనకు, సన్నీ డియోల్‌కు మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉందని చెప్పారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో మూవీ సూపర్ హిట్టయ్యిందన్నారు. ఏదిఏమైనా సల్మాన్ లవ్లీ మ్యాన్ అని పేర్కొన్నారు.

News April 5, 2025

INC, BRS దూరం.. రసవత్తరంగా MLC ఎన్నిక

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ రసవత్తరంగా జరగనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్‌రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇస్తాయనేదానిపైనా ఆసక్తి నెలకొంది. కాగా ఈనెల 23న పోలింగ్ జరగనుండగా 112 మంది ఓటు వేయనున్నారు.

News April 5, 2025

BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

image

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!