News July 17, 2024
ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన జైస్వాల్

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ దూసుకొచ్చారు. 4 స్థానాలు మెరుగుపరుచుకుని 743 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నారు. ట్రావిస్ హెడ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5లో సూర్య, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిదో ప్లేస్‌కు చేరారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అన్రిచ్ నోర్జే టాప్‌లో ఉన్నారు.
Similar News
News September 13, 2025
ముంబై పేలుళ్ల కేసు.. రూ.9 కోట్లు ఇప్పించాలని నిర్దోషి డిమాండ్

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.
News September 13, 2025
విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.
News September 13, 2025
బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.