News December 17, 2024
జమిలి బిల్లు: లోక్సభలో ఎవరి బలం ఎంత?

జమిలి ఎన్నికల బిల్లు నేపథ్యంలో లోక్సభలో పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సంఖ్యాబలమే కీలకం. 543 స్థానాలున్న LSలో NDAకు 293 సీట్లు ఉన్నాయి. ఇందులో BJP 240, TDP 16, JDU 12, SS 7, LJP 5 పెద్దపార్టీలు. INDIAకు 249 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 99, SP 37, TMC 28, DMK 22 పెద్ద పార్టీలు. కూటమిని TMC పట్టించుకోవడం లేదు. ఇక తటస్థ పార్టీల వద్ద 11 సీట్లున్నాయి.
Similar News
News November 25, 2025
లిప్స్కీ LED మాస్క్

ప్రస్తుతం LED మాస్క్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News November 25, 2025
ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.
News November 25, 2025
జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

AP: జిల్లాల <<18381213>>పునర్విభజన<<>>, డివిజన్లు, మండలాల మార్పుచేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. వారు ఇచ్చిన నివేదికపై సీఎం కసరత్తు చేస్తున్నారు.


