News December 17, 2024

జమిలి బిల్లు: లోక్‌సభలో ఎవరి బలం ఎంత?

image

జమిలి ఎన్నికల బిల్లు నేపథ్యంలో లోక్‌సభలో పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సంఖ్యాబలమే కీలకం. 543 స్థానాలున్న LSలో NDAకు 293 సీట్లు ఉన్నాయి. ఇందులో BJP 240, TDP 16, JDU 12, SS 7, LJP 5 పెద్దపార్టీలు. INDIAకు 249 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 99, SP 37, TMC 28, DMK 22 పెద్ద పార్టీలు. కూటమిని TMC పట్టించుకోవడం లేదు. ఇక తటస్థ పార్టీల వద్ద 11 సీట్లున్నాయి.

Similar News

News January 22, 2025

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు మళ్లీ రానున్నాయా?

image

ఇప్పుడంటే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి జాబ్‌ల వివరాలు చేతి వేళ్ల దగ్గరికొచ్చాయి గానీ, 1970, 80 యువతకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లే దిక్కు. మళ్లీ వాటిని తీసుకొచ్చి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ జాబ్ పోర్టల్‌ తీసుకురానున్నట్లు సమాచారం. అందులో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ఖాళీలను రిపోర్ట్ చేయాలి. మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశముంది.

News January 22, 2025

USA ఊహించినంత ప్రయోజనం ఉండదు: రఘురామ్ రాజన్

image

దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.

News January 22, 2025

రంజీ జెర్సీలో మెరిసిన హిట్ మ్యాన్

image

ముంబై తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూ‌కశ్మీర్‌తో జరగనున్న రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.