News December 14, 2024
ఉద్దేశం మంచిదైతే ‘జమిలి’ మేలే: ప్రశాంత్ కిషోర్
సదుద్దేశంతో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే దేశానికి మంచిదే అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఉగ్ర చర్యల కట్టడికి తెచ్చే చట్టాన్ని ఒక వర్గానికే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉన్నప్పుడు, ఇది కూడా అలా కాకూడదన్నారు. 1960 వరకు జరిగిన జమిలి ఎన్నికల్ని దుర్వినియోగం చేసే ఉద్దేశాలు లేకుండా ప్రవేశపెడితే మంచిదే అని పేర్కొన్నారు. దీన్ని క్రమపద్ధతిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 21, 2025
కోడిగుడ్డు తింటున్నారా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతో చాలా మంది కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, D, E, B12, K, B2, B9 పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. చర్మం ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.
News January 21, 2025
APSRTCకి కాసుల వర్షం
AP: సంక్రాంతి పండుగ భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న 3 రోజుల పాటు రోజుకు రూ.20కోట్లకు పైగా ఖజానాలో జమయ్యాయని తెలిపింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 9వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు వెల్లడించింది.
News January 21, 2025
ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జి.. బిల్ ఎంతంటే?
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైఫ్ ఆస్పత్రి పూర్తి బిల్లు రూ.40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సైఫ్ నుంచి ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రూ.7 లక్షలకుపైగా వసూలు చేసినట్లు టాక్. మరోవైపు సైఫ్‌ను రక్షించిన ఆటోడ్రైవర్‌కు ఓ సంస్థ రూ.11 వేల రివార్డు ప్రకటించింది.