News March 14, 2025
జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.
Similar News
News April 9, 2026
ఓటేసిన ప్రముఖులు.. PHOTOS

కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తొలి రెండు గంటల్లో కేరళంలో 16.23, అస్సాంలో 17.87, పుదుచ్చేరిలో 17.71 శాతం పోలింగ్ నమోదైంది. కేరళంలో సీఎం విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, నటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి బైక్‌పై వచ్చి ఓటేశారు.
News April 9, 2026
రేషన్ కార్డుల రీవెరిఫికేషన్.. అనర్హుల తొలగింపు!

TG: అనర్హులకు రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం PAN, GST నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేసి టెస్టు చేసినట్లు సమాచారం. దీంతో HYDలోనే 2L మంది ట్యాక్స్‌పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు తేలిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 80% వెరిఫికేషన్ పూర్తయినట్లు పేర్కొంటున్నాయి. పూర్తి డేటా రాగానే కార్డులను రద్దు చేస్తామంటున్నాయి.
News April 9, 2026
EMIలు కట్టే వారికి గుడ్‌న్యూస్

రెపో రేటులో RBI ఎలాంటి మార్పులు <<19596095>>చేయనప్పటికీ<<>> లోన్ EMIలు తగ్గనున్నాయి. 2025లో RBI రెపో రేటులో 1.25%(125 బేసిస్ పాయింట్లు) కోత పెట్టినా బ్యాంకులు మాత్రం కొత్త లోన్లపై 89 BPs, యాక్టివ్ లోన్లపై 87BPs తగ్గించాయి. అంటే మరో 36 BPsను తగ్గించేందుకు అవకాశం ఉంది. వచ్చే 3 నెలల్లో రెపో రేటు కోత ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు అందించనున్నాయి. దీంతో ఇంటి, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది.


