News June 4, 2024

కాకినాడ లోక్‌సభలో జనసేన లీడింగ్

image

AP: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ కుమార్‌పై 3,400 ఓట్ల లీడ్‌తో కొనసాగుతున్నారు. రంపచోడవరంలో వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 114 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

Similar News

News July 7, 2025

గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

image

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్‌ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.

News July 7, 2025

రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

image

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్‌తో పోటీపడి షారుక్‌ఖానే నిలబడలేకపోయారు. సలార్‌తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.