News May 20, 2024

ఎన్టీఆర్‌కు జనసేనాని బర్త్ డే విషెస్

image

జూనియర్ ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయంగా మెప్పు పొందారని కొనియాడారు. ఈ మేరకు జనసేన తరఫున ప్రకటన విడుదల చేశారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న యంగ్ టైగర్ మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 3, 2024

గుండు చేయిస్తే జుట్టు మందం అవుతుందా?

image

తలపై జుట్టు పలుచగా ఉంటే గుండు చేయించుకోవడం వల్ల మందంగా మొలుస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని, గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదని చెబుతున్నారు. గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకానీ తలపై వెంట్రుకలు ఎక్కువవడం సాధ్యం కాదంటున్నారు.

News December 3, 2024

విపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే?

image

శివసేన పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తి చూపకపోవడంతో ఆయనను ప్రతిపక్షనేతగా నియమించనున్నట్లు సమాచారం. మహాయుతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను కొంతమేర తగ్గించేందుకే కమలనాథులు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మహారాష్ట్ర సీఎంను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

News December 3, 2024

వన్యప్రాణుల బోర్డు ఛైర్మన్‌గా సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో వన్యప్రాణుల బోర్డుకు ప్రభుత్వం కొత్త సభ్యులను నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ ఛైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. అలాగే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలను బోర్డు నియమించింది. ఈ బోర్డులో ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, వంశీ కృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు ఉన్నారు.