News April 19, 2024
జనసేనాని ప్రచార షెడ్యూల్ ఖరారు
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20న పిఠాపురం నుంచి మొదలయ్యే షెడ్యూల్ 22 రోజుల పాటు కొనసాగుతుంది. 21న భీమవరం, నర్సాపురం, 22న తాడేపల్లిగూడెంలో ఆయన పర్యటించనున్నారు. 23న పిఠాపురంలో నామినేషన్ వేస్తారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మే 10న మరోసారి పిఠాపురంలో రోడ్డు షో చేసి అక్కడి సభలో ప్రసంగిస్తారు. 11న కాకినాడ రూరల్‌లో రోడ్డు షోతో షెడ్యూల్ ముగియనుంది.
Similar News
News September 20, 2024
తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ
AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
News September 20, 2024
జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.
News September 20, 2024
‘బంగ్లా’ను కుప్పకూల్చారు
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 149 రన్స్‌కే కుప్పకూల్చారు. బుమ్రా 4, ఆకాశ్ దీప్ 2, జడేజా 2, సిరాజ్ 2 చొప్పున వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 227 రన్స్ ఆధిక్యంలో ఉంది.