News December 3, 2024
నెటిజన్ డేటాను పోస్టు చేసిన జనసేన అభిమాని.. వైసీపీ ఫైర్

AP: ఓ నెటిజన్ వ్యక్తిగత సమాచారాన్ని జనసేన అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. ‘రాష్ట్రంలో పెద్దఎత్తున డేటా ఉల్లంఘన జరుగుతోంది. సున్నితమైన సమాచారం జనసేన అభిమానుల చేతుల్లోకి వెళ్లింది. వేధింపుల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రమాదంలో పడింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరుతున్నాం’ అని ట్వీట్ చేసింది.
Similar News
News April 19, 2026
తిరుపతి: పిల్లల కోసం ప్రత్యేక నిపుణులు.!

వినికి లోపం ఉన్న 0-3 ఏళ్ల పిల్లలను <<19688630>>శ్రవణం<<>> ప్రాజెక్ట్‌లో చేర్చుకుంటారు. వీరికి TTD టెస్టులు నిర్వహించి, ఆ తరువాత రేషన్ కార్డు, అమ్మనాన్న, చిన్నారి ఆధార్ కార్డు, ఫామిలీ సర్టిఫికెట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రంతో జాయిన్ చేసుకుంటుంది. ఇక్కడ చిన్నారులకు మూడేళ్ల వరకు శిక్షణ ఇస్తారు. ఇందు కోసం ప్రత్యేక నిపుణులను TTD ఏర్పాటు చేసింది. మూడేళ్లు పిల్లలతోపాటు పేరెంట్స్‌కు వసతి, భోజన సదుపాయం ఉచితం.
News April 19, 2026
ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.
News April 19, 2026
నేడే అక్షయ తృతీయ.. బంగారం ధర ఎంతంటే?

ఇవాళ అక్షయ తృతీయ కావడంతో చిన్న బంగారు వస్తువైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది నమ్మకం. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800కు విక్రయిస్తున్నారు.


