News July 18, 2024
నేటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు
జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ్టి నుంచి ఈనెల 28 వరకు జరగనుంది. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. సభ్యత్వం పొందే ప్రతీ ఒక్కరికి ప్రమాద, జీవిత బీమా అందించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ను నేడు ఉ.10కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు.
Similar News
News December 1, 2024
ఇది మహారాష్ట్రకు అవమానకరం: ఆదిత్య ఠాక్రే
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం మహారాష్ట్రకు అవమానకరమని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. అసెంబ్లీ గడువు ముగిసినా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని క్లైం చేసుకోకుండానే ప్రమాణస్వీకారానికి తేదీ ప్రకటించడం అరాచకమని మండిపడ్డారు. వర్లీ నుంచి ఆదిత్య గెలిచిన విషయం తెలిసిందే.
News December 1, 2024
రేపు చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తుగా సెలవు ఇచ్చారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
News December 1, 2024
ఈ జ్యూస్‌లను తాగకపోవడమే మంచిది: వైద్యులు
పండ్లు తినే బదులు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది కదా? అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఈ మూడింట్లో ఏది బెటరో వైద్యులు సూచించారు. ‘ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో అధిక మొత్తంలో షుగర్ ఉండటం వల్ల వాటిని సేవించొద్దు. తాజా పండ్ల రసాలు తాగడం వల్ల అధిక మొత్తంలో పండ్లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ జ్యూస్ తాగినా, తాజా పండ్లు తినేందుకే మొగ్గుచూపాలి’ అని డాక్టర్లు తెలిపారు.