News March 24, 2024

జనసేన పెండింగ్ స్థానాలివే!

image

AP: టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన జనసేన మూడింటిని పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News December 5, 2025

టిఫా స్కాన్‌లో ఏం చెక్ చేస్తారంటే?

image

టిఫా అంటే.. టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌. నిపుణులైన రేడియాలజిస్టులు ఈ స్కాన్‌ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్‌ చేస్తారు. శిశువు, ప్లాసెంటా పొజిషన్, ఉమ్మనీరు స్థితి గుర్తిస్తారు. అలాగే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి ప్రసవం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ స్కాన్ ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి ఈ స్కాన్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

News December 5, 2025

ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

image

ప్రతి ఇంట్లో దాదాపు మహిళలే పూజలు చేస్తుంటారు. కానీ సంకల్ప శ్లోకాలు “ధర్మపత్ని సమేతస్య” అని చెబుతాయి. అంటే భార్య సమేతంగా భర్తే పూజలో ప్రధానం అని అర్థం. భర్త క్షేమం కోసం భార్య చేసే పూజలు మినహా నిత్య పూజలు, ఇతర వ్రతాలను ఇద్దరు కలిసి చేస్తేనే అత్యుత్తమ ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. దీపం వెలిగించడం, సంకల్పం చేయడం, ప్రధాన పూజాచర్యలు నిర్వహించాల్సిన బాధ్యత భర్తదే అని చెబుతున్నారు.

News December 5, 2025

IIT జోధ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

IIT జోధ్‌పూర్‌లో 24 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MTS, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్స్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీపీటీ, ఎంపీటీ, బీఎస్సీ నర్సింగ్, GNM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు LMV/HMV లైసెన్స్ ఉండాలి. వెబ్‌సైట్: https://www.iitj.ac.in/